చర్మ సౌందర్య రహస్యాలు, స్లైడర్,

చర్మానికి కొబ్బరి నూనె యొక్క అంతులేని ప్రయోజనాలు

ప్రకృతిలో విరివిగా లభించే పండ్లలో కొబ్బరికాయ ఒకటి    . ఈ కొబ్బరికాయ యొక్క ప్రాచుర్యం, ముఖ్యంగా కొబ్బరి నూనెతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల వల్ల పెరిగింది. కొబ్బరి నూనె 100% కొవ్వు, అందులో 80% ఉండేది ఆరోగ్యకరమైన సంతృప్త కొవ్వు. 

దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు మరియు మొక్కల స్టెరాల్స్ యొక్క జాడల వల్ల ఫైబర్ ఉండదు. కొబ్బరి నూనె అంతర్గతంగా మరియు బాహ్యంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సమర్థవంతమైన కొబ్బరి నూనె యొక్క ఆవశ్యకతలను ఇక్కడ మేము వివరిస్తాము.

మొదటి దశ ఫేస్ వాష్ గా

కొబ్బరి నూనె సహజంగానే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు తేమగా ఉన్నందున, ప్రతి ఒక్కరు దీనిని మాయిశ్చరైజర్ గా ఉవయోగిస్తారు. 

కొబ్బరి నూనెతో ఈ డబుల్ క్లీన్సింగ్ పద్ధతిని ప్రయత్నించండి

చర్మాన్ని శుభ్రపరచడాన్ని క్లీన్సింగ్ అంటారు. కొబ్బరి నూనెను ముఖం మీద పూయండి. మీ ముఖం మరియు మెడ అంతటా కొన్ని నిమిషాలు వృత్తాకార కదలికలతో నెమ్మదిగా మర్దనా చేయండి. తరువాత సున్నితమైన ఫేస్-వాష్ తో ముఖాన్ని కడగాలి.

ఫేస్ మాస్క్‌ గా

కొబ్బరి నూనెతో ముఖం మర్దనా కాకుండా మీ చర్మాన్నిసంరక్షించుకోవడానికి ఏది మంచి మార్గం? దీనికి సమాధానం, కొబ్బరి నూనె హీలింగ్ మాస్క్ ని మీరు వాడవచ్చు.

ఈ హీలింగ్ మాస్క్ షీ కాంట్ ఈట్ వాట్? నుండి వచ్చింది 

రెండు చిటికెల పసుపు (యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిఉంటుంది), ఒక చెంచా నిమ్మరసం (విటమిన్ సి తో చర్మం ప్రకాశవంతం కావడానికి), ముడి తేనె (మొటిమలకు చికిత్స చేస్తుంది) మరియు స్వచ్ఛమైన కొబ్బరి నూనె (అదనపు హైడ్రేషన్ కోసం) మిశ్రమాన్నిశుభ్రమైన ముఖానికి పూయండి, కనీసం 15 నిమిషాలు అలాగే ఉంచండి తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

కంటికి క్రీమ్ గా

మార్కెట్లో కళ్ళకి సంబందించిన హైడ్రేటింగ్ క్రీమ్స్ పుష్కలంగా ఉన్నప్పటికీ, కొబ్బరి నూనె కళ్లకింద నలుపు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను కళ్ళకి హైడ్రేటింగ్ క్రీమ్‌గా ఉపయోగించడం వల్ల మీ చర్మపు రంగును చైతన్యపరుస్తుంది. 

కొబ్బరి నూనెని తేలికపాటి పొరలా కళ్లకింద రాయండి మరియు కళ్ళ చుట్టూ ఉంగరపు వేలిని ఉపయోగించి మెల్లగా మర్దనా చేయండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు రక్షిస్తుంది. 

లిప్ స్క్రబ్‌గా

కమర్షియల్ లిప్ స్క్రబ్స్‌లో కొబ్బరి నూనెతో పాటు కెమికల్స్ కూడా ఉంటాయి. అందువల్ల, కొబ్బరి నూనె లిప్ స్క్రబ్ ని, తేనె మరియు బ్రౌన్ షుగర్ ఉపయోగించి మీరు సులభంగా మీ స్వంతంగా తయారు చేసుకోవచ్చు. 

ఈ లిప్ స్క్రబ్ సూపర్ మాయిశ్చరైజింగ్ మరియు రుచికరమైనది! ఇది మీ పెదాలను శాంతముగా ఎక్స్‌ఫోలియేట్(శుభ్రం) చేస్తుంది మరియు అదే సమయంలో వాటిని తేమగా చేస్తుంది. 

లిప్ బామ్ గా

2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల తేనె మరియు 2 టేబుల్ స్పూన్ల కోకో బటర్ ని ఒక గిన్నెలో కలపండి. ఈ మిశ్రమాన్ని కరిగే వరకు కలుపుతూ డబల్ బాయిల్ చెయ్యండి. 

ఇప్పుడు నీటి నుండి గిన్నెను జాగ్రత్తగా తీసివేసి, మీకు ఇష్టమైన మాయిశ్చరైజింగ్ నూనెని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని లిప్ బామ్ కంటైనర్ లో పోయాలి. దీనిని కొన్ని గంటలు రెఫ్రిజిరేటర్ లో నిలువచేసుకొని లిప్ బామ్ గా వాడుకోవచ్చు.

స్నానం చేసేటప్పుడు మాయిశ్చరైజర్‌గా

కొబ్బరి నూనెను చర్మానికి నేరుగా పూయడం మీకు నచ్చకపోయినా, మీరు దానిని వాడటం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. మీ రెగ్యులర్ స్నాన సమయ దినచర్యలో భాగంగా కొబ్బరి నూనెను వాడండి. 

మీ స్నానపు నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి మీ చర్మాన్ని తల నుండి కాలి వరకు హైడ్రేట్ చేసుకోండి. ఈ అద్భుతమైన చిట్కా మీ పొడి చర్మంలో చైతన్యం నింపుతుంది. 

మొత్తంమీద, ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల కొబ్బరి నూనె యొక్క అద్భుతమైన ప్రయోజనాలను మీరు పొందుతారు. ఈ చిట్కాలు ఉపయోగించడానికి సులభమైనవి మరియు చవకైనవి. 

కొబ్బరి నూనెను చాలా పొడిగా, పగుళ్లతో ఉండే చర్మంపై మాయిశ్చరైజర్‌గా వాడండి. ఇది దద్దుర్లు నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు మీ చర్మం యొక్క ఇమ్మ్యూనిటి ని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

writer

The author didnt add any Information to his profile yet

ఇన్స్టాగ్రామ్

Unable to communicate with Instagram.